ఏడేళ్లలో జిల్లా వ్యాప్తంగా కుక్కకాటుకు గురైన వారి వివరా
ఏడాది 2019 2020 2021 2022 2023 2024 2025 2026బాధితులు 3,048 2,400 2,168 1,685 2,277 657 1,042 138 (ఫిబ్రవరి వరకు)
మంచిర్యాలటౌన్: జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఎక్కడ చూసినా వీధుల్లో శునకాలు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తుండగా వానరాలు ఇళ్లల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్క కాటుకు గురైన వారి సంఖ్యతో సమానంగా కోతుల బారిన పడి క్షతగాత్రులుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల కాలంలో వీధికుక్కల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం, చిన్నారులు, వృద్ధులపై దాడిచేసి కరుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధులతో పాటు, ప్రధాన రహదారులపై వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ఎక్కువగా చిన్నారులు, వృద్ధులను కరుస్తున్నాయి. దీంతో బయటకు వెళ్లాలంటే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా వెళ్లే వారిని వెంటాడి కరుస్తుండడం, కుక్కకాటుకు గురై ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో వీధుల్లో సంచరిస్తున్న కుక్కల బెడద ఎక్కువగా కావడంతో ఉదయం పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వృద్ధులు, మహిళలు భయాందోళన చెందుతున్నారు.
కోతులతోనూ ఇబ్బందులు
వీధుల్లోకి వెళ్తే కుక్కల బెడద ఎదురవుతుండగా, ఇళ్లల్లోకి కోతులు చొరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇళ్లపైకి ఎక్కడం, ఇళ్లల్లో పెంచుకున్న చెట్లపై ఆడుతూ, ఇంటి నుంచి ప్రజలు బయటకు రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోతుల బారి నుంచి రక్షించాలని ప్రజలు కొంత కాలంగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. సరైన చర్యలు చేపట్టకపోవడంతో కోతుల బెడద తీవ్రంగా మారుతోంది. కోతులు నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తుండగా, ఇంట్లో ఉండే ప్రజలపై దాడులు చేస్తున్నాయి. కోతులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేయడంతో అదుపుతప్పి కిందపడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంట్లో ఉన్న వారు బయటకి వస్తే చాలు వారిపై దాడులకు దిగుతుండడం, చిన్నారులు, వృద్ధులు, మహిళలు కోతుల బారిన పడి గాయాల పాలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా కోతుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజుకు పదికి పైగానే ఉంటోంది. నేరుగా కోతులు గాయపర్చిన వారికంటే ఎక్కువగా కోతుల బెదిరింపుతో కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న వారి సంఖ్యనే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలో కోతులు, కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉండడం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వారితో పాటు, ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శునకాలు, వానరాల భారినుంచి రక్షణ కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
మంచిర్యాల నగరంలోని కాలనీల్లో ఇళ్లపై సంచరిస్తున్న కోతులు
మంచిర్యాల నగరంలోని కాలనీల్లో గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు
ఏడేళ్లలో జిల్లా వ్యాప్తంగా కుక్కకాటుకు గురైన వారి వివరా
ఏడేళ్లలో జిల్లా వ్యాప్తంగా కుక్కకాటుకు గురైన వారి వివరా


