మైనార్టీ గురుకులాల్లో ఉపవాస దీక్షలు
మంచిర్యాలఅర్బన్: పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలు నెలరోజులపాటు ఉద యం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఉపవాసదీక్షలు చేస్తా రు. దీక్ష సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. ఇందుకు అనుగుణంగా మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో రంజాన్ మాసాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇంట్లో మాదిరి సౌకర్యాలు సమకూర్చడంతో విద్యార్థులు నిష్టతో ఉపవాస దీక్షలు (రోజా)పాటిస్తున్నారు. సూర్యోదయానికి ముందు సెహ్రీ సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్‌తో ఉపవాసాలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక, క్రమశిక్షణ పెంపొందించేందుకు ప్రత్యేక వసతులు కల్పించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు.
ప్రతీరోజు ఇలా..
జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో మూడు మైనార్టీ గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 931 మంది, ఇంటర్ విద్యార్థులు 255 మంది విద్యను అభ్యసిస్తున్నారు. రంజాన్ ఉపవాసదీక్ష దీక్షలు (రోజా)చేపట్టే విద్యార్థుల కోసం వార్డెన్లు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీరోజు తెల్లవారుజామున ఉపవాసానికి (సహర్)కు అనుగుణంగా భోజనం సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం ఇఫ్తార్ సమయానికి రకరకాల పండ్లు , డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు, ఖర్జురాలు ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి తెలిపారు.
జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో విద్యార్థుల వివరాలు
పాఠశాల 5 నుంచి ‘పది’ ఇంటర్
మంచిర్యాల (గర్ల్స్) 374 102
బెల్లంపల్లి(గర్ల్స్) 235 84
చెన్నూర్ (బాయ్స్) 322 69


