ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి
మంచిర్యాలటౌన్: ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని, ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు వెంటనే పరిష్కరించేలా చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. నగరంలోని 59వ డివిజన్ కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ తన 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం సందర్భంగా ఆదివారం డివిజన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగీలాల్ సోమాని, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.


