అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
శ్రీరాంపూర్: మంచిర్యాల నియోజకవర్గంలో అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. శనివారం శ్రీరాంపూర్‌లోని 6వ డివిజన్ పరిధిలో లబ్ధిదారుల గృహ ప్రవేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతోందని అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నస్పూర్ ఇన్‌చార్జి నూకల రమేష్, నాయకులు మాకు మల్లయ్య, రావి కిషన్‌కుమార్, పవన్ కళ్యాణ్, గుంపుల స్వప్న, జే.నర్సింగ్, అంగడి రాజేష్, భీమిని రాజేష్ పాల్గొన్నారు.


