కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

శ్రీరాంపూర్‌: కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బీ.జనక్‌ప్రసాద్‌ తెలిపారు. శనివారం ఆయన ఆర్కే 7, ఆర్కే న్యూటెక్‌ గనులను సందర్శించి కార్మికులను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. అలవెన్సులపై ఆదాయపన్ను మాఫీ, సొంతింటి పథకం, మెడికల్‌ బోర్డు పునరుద్ధరణ వంటి వాటి కోసం యజమాన్యం, ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని, త్వరలో నెరవేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు, నాయకులు భీంరావు, గరిగే స్వామి, ఏనుగు రవీందర్‌రెడ్డి, తిరుపతి రాజు, తిరుపతిరెడ్డి, పేరం రమేష్‌, ల్యాగల శ్రీనివాస్‌, మహేందర్‌, రౌతు సత్యనారాయణ, అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement