ముధోల్‌లోని నాలుగు దుకాణాల్లో చోరీ
ముధోల్: మండల కేంద్రంలోని నాలుగు దుకాణాల్లో చోరీ జరిగినట్లు ఎస్సై బిట్లా పెర్సీస్ తెలిపారు. బాధితులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్ సమీపంలోని చెప్పుల దుకాణంలో చొరబడిన దొంగలు రూ.4,800 నగదు ఎత్తుకెళ్లారు. అరిఫోద్దీన్, అబ్ధుల్ ఖాలీద్, మహ్మద్ అబ్ధుల్‌కు చెందిన మూడు పాన్‌షాపుల తాళాలు పగులగొట్టారు. మహ్మద్ యూసుఫ్ కూరగాయల షాపు నుంచి రూ.3,200 నగదు అపహరించారు. చోరీకి పాల్పడ్డ మేకల అరుణ్ (చిన్నా)ను పట్టుకుని విచారించగా చోరీ సొత్తును చెరువులో దాచిపెట్టినట్లు చెప్పాడు. దీంతో చెరువు వద్దకు వెళ్లి డబ్బులు తీసుకువచ్చినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు చిన్నాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.


