కనకాపూర్‌లో ఇంట్లో.. | - | Sakshi
Sakshi News home page

కనకాపూర్‌లో ఇంట్లో..

Mar 1 2026 7:25 AM | Updated on Mar 1 2026 7:25 AM

కనకాపూర్‌లో ఇంట్లో..

కనకాపూర్‌లో ఇంట్లో..

లక్ష్మణచాంద: మండలంలోని కనకాపూర్‌లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కనకాపూర్‌ గ్రామానికి చెందిన షేర్ల రవి కుటుంబ సభ్యులతో శుక్రవారం ఇంటికి తాళం వేసి అత్తగారి ఊరు తాండ్రాకు వెళ్లారు. అతని త మ్ముడు సంతోష్‌ శనివారం వేకువజామున లేచి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. విషయం సోదరుడు రవికి ఫోన్‌లో తెలిపాడు. వెంటనే రవి వ చ్చి చూడగా బీరువాలోని రూ.లక్షా 20వేలు నగదు, 2.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై శ్రావణి, సోన్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి ఘటనా స్థలా న్ని పరిశీలించి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చే శారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యే క బృందాలను నియమించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement