దాడికి పాల్పడ్డ మేకల కాపరిపై కేసు | - | Sakshi
Sakshi News home page

దాడికి పాల్పడ్డ మేకల కాపరిపై కేసు

Mar 1 2026 7:25 AM | Updated on Mar 1 2026 7:25 AM

దాడికి పాల్పడ్డ  మేకల కాపరిపై కేసు

దాడికి పాల్పడ్డ మేకల కాపరిపై కేసు

వేమనపల్లి: మండల కేంద్రానికి చెందిన రైతు తుమ్మిడె సాయికిరణ్‌పై దాడికి పాల్పడ్డ మేక ల కాపరి మొగిలి రాజన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26న గొర్లపల్లికి చెందిన మేకల కాపరి మొగిలి రాజన్న మండల కేంద్రానికి చెందిన సాయికిరణ్‌ పత్తి చేనులోకి మేకల మంద పోనిచ్చా డు. పత్తి తీస్తుండగా మేకలను చేనులో ఎందుకు మేపుతున్నావని సాయికిరణ్‌ నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాజన్న సాయికిరణ్‌పై గొడ్డలి కామతో కాలి మడిమపై బలంగా కొట్టాడు. గాయపడ్డ సాయికిరణ్‌ మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్న సాయికిరణ్‌ ఫిర్యాదు అతడి ఇంటికివెళ్లి ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement