తైక్వాండో పోటీల్లో అస్మితకు గోల్డ్ మెడల్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యా ల నగరం గౌతమినగర్‌కు చెందిన విశ్వనాథ్ అస్మిత ఈ నెల 27, 28వ తేదీల్లో యూనివర్సిటీ స్థా యి గేమ్స్ తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న అస్మిత హన్మకొండలోని తమ కాలేజీ తరఫున 62కేజీల విభాగంలో పాల్గొంది. తల్లిదండ్రులు జయంతి, రాము తన గురువు మండ శ్రీనివాస్ శిక్షణతో తైక్వాండోలో రాణిస్తున్నానని అస్మిత సంతోషం వ్యక్తం చేసింది. అసోసియేషన్ తరఫున అధ్యక్ష, కార్యదర్శులు జీ వెంకటస్వామి, బుచ్చిరామారావు అభినందిస్తూ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


