రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి
దండేపల్లి: బంధువును ఇంటి వద్ద దించేందుకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆకుల అక్షయ్‌కుమార్ (23) రాయపట్నంకు చెందిన తమ బంధువును వాళ్ల ఇంటివద్ద దింపేందుకు వెళ్లాడు. శుక్రవారం రాత్రి బైక్‌పై తిరిగి వస్తుండగా గూడెం గోదావరి నది వంతెనపై లారీ ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే వారు వంతెన వద్దకు చేరుకుని కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు.
మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం
గూడెం గ్రామానికి చెందిన ఆకుల తిరుపతి–సులోచన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అక్షయ్‌కుమార్ ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహమైంది. అక్షయ్‌కుమార్ లక్సెట్టిపేటలో డిగ్రీ చదువుతున్నాడు. కొడుకు చేతికి అందివచ్చే సమయంలో ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని బాధిత కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
గుడిహత్నూర్‌లో మహిళ..
గుడిహత్నూర్: తాగిన మైకంలో లారీ డ్రైవర్ జాతీ య రహదారి 44పై ముందు వెళ్తున్న కారును ఢీకొ ట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలి పిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జవహర్‌నగర్ వద్ద 15 అడుగుల ఎత్తులో ఉన్న జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న భారీ లారీ ఢీకొట్టింది. దీంతో కారు పైనుంచి సర్వీస్ రోడ్డుపై పల్టీలు కొట్టింది. లారీ కూడా స ర్వీస్ రోడ్డుపై దూసుకువచ్చి ఓ చెట్టును ఢీకొట్టి ఆగి పోయింది. ఈ సమయంలో సర్వీస్ రోడ్డుపై వాహనాలు, మనుషులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అ క్కడికి చేరుకుని గాయపడి కారులోనే ఉన్న షేక్ నజీరాబేగం, షేక్ అబ్ధుల్ ఖదీర్, షేక్ అఫ్జల్, డ్రైవర్ సిర్పులే మోహన్‌ను బయటకు తీసి చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. కాగా, షేక్‌నజీరాబేగం (42) అప్పటికే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న వీరంతా ఇచ్చోడ మండలంలోని మాదాపూర్‌కు చెందినవారు. అనారోగ్యంతో ఉన్న షేక్ నజీరాబేగంను ఆదిలాబాద్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న డ్రై వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సర్వీస్ రోడ్డు ను క్లియర్ చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మంచిర్యాలలో ఎంపీవో..
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పట్ట ణ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మంచి ర్యాలకు చెందిన ములకల సత్యనారాయణ (52) మందమర్రిలో మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం డ్యూ టీ నిమిత్తం తాను నివాసముంటున్న రాంనగర్ ఏరి యా నుంచి బైక్‌పై వెళ్తుండగా శ్రీరాంపూర్ నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న లారీ అతివేగంతో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ స త్యనారాయణ అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య జమున, పిల్లలు శ్రీధర్, శ్రావ్య ఉన్నారు. జమున ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మందమర్రిరూరల్: రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండల పంచా యతీ అధికారి ముల్కల్ల సత్యనారాయణరెడ్డి మృతి చెందగా అతడి కుటుంబ సభ్యులను డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీఎల్‌పీవోలు కొమ్మెర సతీశ్, ధర్మారా ణి, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవోలు శ్రీపతి బాపు, సఫ్దర్‌అలీ, అజ్మత్‌అలీ, శ్రీనివాస్, అనిల్‌కుమార్, ప్రసాద్ పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
కరీంనగర్‌లో నిర్మల్ డీసీవో..
కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదంలో నిర్మల్ డీసీవో మృతి చెందారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని భగత్‌నగర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన జేరిపోతుల నర్సయ్య (60) నిర్మల్ డిస్ట్రిక్ కోఆపరేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్కూటీపై అల్గునూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పంది అడ్డురావడంతో కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి


