మూడో కన్ను!
అడవుల రక్షణకు
ఘనిశెట్టి కుంటలో డ్రోన్ ఎగురవేస్తున్న సిబ్బంది
పైలెట్ ప్రాజెక్ట్‌గా ఇందన్‌పల్లి
డ్రోన్ ద్వారా పర్యవేక్షించేందుకు మొదట జన్నారం అటవీ డివిజన్‌లోని ఇందన్‌పల్లి రేంజ్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎన్నుకున్నారు. ఇందన్‌పల్లి రేంజ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యవేక్షణ చేశారు. డ్రోన్ ఎలా ఎగురవేయాలి.. పైకి ఎగిరాకా వీడియోలు, ఫొటోలు ఎలా తీయాలనే అంశాలను శనివారం రేంజ్ పరిధిలోని సిబ్బందికి రవికాంత్ సూచించారు. రెండు రోజుల నుంచి పలు ఫొటోలు కూడా తీశారు. రాత్రి పూట కూడా అడవులను పర్యవేక్షించడం, స్మగ్లింగ్, వేట, చెట్లు నరకడం లాంటి ఘటనలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు రేంజ్ అధికారి తెలిపారు.


