అనారోగ్యంతో రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

Mar 1 2026 7:25 AM | Updated on Mar 1 2026 7:25 AM

అనారోగ్యంతో రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

అనారోగ్యంతో రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సంపత్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చున్నంబట్టి వాడకు చెందిన తాటికొండ రవీందర్‌ (55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో తీ వ్ర మనస్తాపానికి గురై శనివారం రైలు కింద ప డి ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్‌కు భా ర్య శ్యామల, కుమారులు సాయి, విజయ్‌ ఉ న్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంపత్‌ తెలిపారు.

ఎస్పీఎం కార్మికుడికి గాయాలు

కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో శని వారం చోటు చేసుకున్న ప్రమాదంలో సర్ధార్‌ బస్తీకి చెందిన నాగరాజు అనే కార్మికుడికి గాయాలయ్యాయి. వివరాలు.. నాగరాజు ఇన్‌స్ట్రుమెంట్‌డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండగా కంప్రెషర్‌ టెంపరేచర్‌ అధికమైంది. దానిని తగ్గించే క్రమంలో నాగరాజు ఫ్యాన్‌ గాలికి అందులో ఇరుక్కుపోయాడు. వెంటనే సమీప కార్మికుడు గమనించి హుటాహుటిన పక్కకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని తాపీమేస్త్రీ దుర్మరణం

జైపూర్‌: మండలంలోని టేకుమట్ల ఎక్స్‌ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పాత మంచిర్యాలకు చెందిన బండి శ్రీనివాస్‌ ఇందారం ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నుల్లో తాపీమేసీ్త్రగా పని చేస్తున్నాడు. శుక్రవా రం సాయంత్రం పనులు ముగించుకుని బైక్‌పై పాతమంచిర్యాలకు వెళ్తుండగా టేకుమట్ల ఎక్స్‌ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం అతడి బై క్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో మంచి ర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు స్రవంతి ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement