ఆర్జీయూకేటీలో సైన్స్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో సైన్స్‌ దినోత్సవం

Mar 1 2026 7:25 AM | Updated on Mar 1 2026 7:25 AM

ఆర్జీయూకేటీలో సైన్స్‌ దినోత్సవం

ఆర్జీయూకేటీలో సైన్స్‌ దినోత్సవం

● విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన

బాసర: బాసర ఆర్జీయూకేటీలో శనివారం జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఫిజిక్స్‌ విభా గం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించగా వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ మురళీదర్శన్‌ హాజరై విద్యార్థుల కు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని ఐఐటీలో ఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌ కాంచన సైన్స్‌ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, వారు ఎలా అద్భుతమైన పరిశోధనలు చేయవచ్చో వివరించారు. హైదరాబాద్‌ యూనివర్సిటీ ప్రొఫెస ర్‌ వైదీశ్వరన్‌, నాందేడ్‌ ఎస్‌ఆర్టీఎం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కృష్ణచైతన్య, హైదరాబాద్‌ జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ ఉమ, హైదరాబాద్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఓదెలు వంగా వివిధ అంశాల గురించి వి ద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫిజిక్స్‌ విభా గాధిపతి, ప్రోగ్రామ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ దేవరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అసోసియేట్‌ డీన్‌లు డాక్టర్‌ విఠల్‌, శేఖర్‌ శీలం, మహేశ్‌, ప్రకాశ్‌, ఇతర వి భాగాధిపతులు శ్రీనివాస్‌, సురేశ్‌ దేవనపల్లి, సాయికృష్ణ పాల్గొన్నారు. ఫిజిక్స్‌ ఫ్యాకల్టీ సభ్యులు చింతా నరేశ్‌, మండ సతీశ్‌, రామకృష్ణ, డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ గజ్జెల శ్రీనివాస్‌, తిరుపతి, శ్వేత, రమాకాంత్‌, ఇతర అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ప్రదర్శనలు తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement