● జన్నారం డివిజన్‌లో డ్రోన్‌తో పర్యవేక్షణ ● ఇప్పటికే శి
జన్నారం: అడవుల రక్షణకు అటవీ అధికారులు సాంకేతికతను వినియోగిస్తున్నారు. సిబ్బంది పర్యవేక్షిస్తున్నా అక్కడక్కడా స్మగ్లింగ్, అటవీ వ్యతిరేక కా ర్యకలాపాలు జరుగుతున్నందున అటవీశాఖ మూ డో కన్ను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్‌లతో పర్యవేక్షించేందుకు నిర్ణయించింది. జియో ఇన్‌ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేసే విధానంపై సిబ్బంది నాలుగు రోజులపాటు శిక్షణ పొందారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి చెంది న ప్రతినిధి రవికాంత్ డివిజన్‌లోని ఆరుగురు అట వీ సిబ్బందికి డ్రోన్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. నాలుగురోజుల శిక్షణ శనివారం పూర్తయినట్లు ఇందన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు.
ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి..
డ్రోన్ కెమెరా ఎనిమిది కిలో మీటర్ల దూరం నుంచి పర్యవేక్షిస్తుంది. రాత్రి పూట థర్మల్ సిగ్నిచర్ ద్వారా అడవిలో కార్యకలాపాలను పర్యవేక్షణ చేయవచ్చని అటవీ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి డ్రో న్‌తో పర్యవేక్షణ చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి పూట డ్రోన్‌తో పర్యవేక్షించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించినట్లు అధికారులు తెలిపా రు. ప్రతిరోజూ పర్యవేక్షణతో అడవులు, వన్యప్రాణులను కాపాడుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తే డివిజన్‌లోని మూడు రేంజ్‌లకు మూడు డ్రోన్‌లు ఏర్పాటు చేసే అవకాశముంది.


