స్పెల్‌బీ, క్విజ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం పీఎంశ్రీ పాఠశాలల స్పెల్‌బీ, క్విజ్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 25 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. స్పెల్‌బీ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్ విభాగాల్లో, క్విజ్‌లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్విజ్ సీనియర్ పోటీల్లో తెలంగాణ మోడల్ స్కూల్(మంచిర్యాల) ప్రథమ, కోటపల్లి ద్వితీయ, గుడిపేట మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాల తృతీయ స్థానంలో నిలిచాయి. క్విజ్ జూనియర్స్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సుద్దాల ప్రథమ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జెండా వెంకటపూర్ ద్వితీయ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు(నలుగురు చొప్పున) తృతీయ స్థానంలో నిలిచారు. స్పెల్‌బీ సబ్ జూనియర్స్‌లో వైశాలి, సంజన, ఆదిత్య, జూనియర్స్‌లో శ్రీశరణ్య, సాత్విక్, అంజలి, సీనియర్స్‌లో ఎస్.సాయి రేవంత్, మధుప్రియ, భవిత వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందారు. న్యాయనిర్ణేతలుగా మహేష్, రాజన్న, రాకేష్, నరసింహులు, పుష్పలత, రాణి, భాగ్యలక్ష్మీ వ్యవహరించారు. విజేతలకు సెక్టోరల్ అధికారులు సత్యనారాయణమూర్తి, చౌదరి, రాజ్‌కుమార్, రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ మధు బహుమతులు అందజేశారు.


