ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

Feb 27 2026 4:13 AM | Updated on Feb 27 2026 4:13 AM

ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

చెన్నూర్‌రూరల్‌: మండలంలోని బావురావుపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద బైక్‌ ఢీకొని కోటపల్లి మండలం బబ్బరచెలుక గ్రామానికి చెందిన ఆసంపల్లి వెంకటస్వామి(48) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటస్వామి బుధవారం రాత్రి టోల్‌ప్లాజా వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో బావురావుపేట గ్రామానికి చెందిన గంగుల శ్రీరామ్‌ అనే వ్యక్తి బైక్‌తో వచ్చి ఢీకొట్టాడు. దీంతో వెంకటస్వామి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చెన్నూర్‌ పట్టణ సీఐ బన్సీలాల్‌ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలంలోనే స్పాట్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ తెలిపారు. కాగా సంఘటనా స్థలంలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చెన్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ చరిత్రలో తొలిసారని, జిల్లాలోనే రెండొవదన్నారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement