దరఖాస్తు చేసుకోవాలి..
క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కోసం ఆటల్లో ప్రతిభగల చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మార్చి 21వ తేదీలోపు మండల స్థాయి ఎంపిక పోటీలు పూర్తవుతాయి. మార్చి 28న జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తాం. ఏప్రిల్ 1వ తేదీ లోపు జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన చిన్నారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తాం. ఏప్రిల్ 27 నుంచి జిల్లా నుంచి ఎంపికై న చిన్నారులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాలుపంచుకుంటారు. చిన్నారులను వారి తల్లిదండ్రులు, ఒక శిక్షకునితో రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తాం.
– జక్కుల శ్రీనివాస్,
డీవైఎస్‌ఓ, ఆదిలాబాద్


