భక్తుల ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు
ఆదిలాబాద్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ విశిష్ట ప్రసాదమైన ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కేంద్రంలోని రీజియన్ కార్యాలయంలో గురువారం రీజినల్ మేనేజర్ ఎస్. భవానీ ప్రసాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ సహకారంతో భద్రాద్రి వెళ్లలేని భక్తుల కోసం కేవలం రూ. 151లు చెల్లించి తలంబ్రాల ప్యాకెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలోని భక్తులు సమీపంలోని ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా గానీ, www. tgsrtclogistics. co. in వెబ్‌సైట్ ద్వారా గానీ తమ బుకింగ్‌లను చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు ఆదిలాబాద్ 9154298531, భైంసా 9154298547, ఆసిఫాబాద్ 9154298541, రీజినల్ కార్యాలయం 9154298553 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు డి. హర్ష (ఓ), ఎస్. రామయ్య (ఎం), పర్సనల్ ఆఫీసర్ ఆర్.జి. జెబ్లా, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్. రమేశ్, అసిస్టెంట్ మేనేజర్లు ఐ. రాజశేఖర్ (ట్రాఫిక్), సి. రాజేందర్ (మెకానికల్), డిప్యూటీ సూపరింటెండెంట్ డి. లావణ్య, రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కె. సాయన్న, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.కె. అన్సారీ తదితరులు పాల్గొన్నారు.


