వాటర్ ట్యాంక్ ఎక్కిన బీఆర్‌ఎస్ నాయకుడు
చెన్నూర్: పట్టణంలోని 17వ వార్డు మాజీ కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త బీఆర్‌ఎస్‌కు చెందిన నాయిని సతీశ్ బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని గురువారం స్థానిక మజీద్ పక్కన గల వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేశాడు. సుమారు 30 నిషాముల పాటు వాటర్ ట్యాంక్‌పై ఉండి సుమన్‌ను విడుదల చేస్తామని హామీ ఇస్తేనే కిందికి దిగుతానని బెదిరింపులకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న ఎస్సైలు శ్యాంపటేల్, సుబ్బారావులు సంఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పి కిందికి దింపారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు పోలీసులు తెలిపారు.
షార్ట్‌సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
నిర్మల్ టౌన్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇ ల్లు దగ్ధమైన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఇంద్రనగ ర్ కాలనీలో నివాసముండే సంతోష్ చారి ఇంట్లోగురువారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఇంట్లో వారు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచా రం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ఫైర్ అధికారి శివాజీ తెలిపారు.


