మహిళా సంఘాల వ్యాపార అభివృద్ధికి మద్దతు
పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యుల వ్యాపార అభివృద్ధికి తెలంగాణ వి హబ్ రేసింగ్ అండ్ ఆక్సిలరేటింగ్(ర్యాంప్), మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఈ) ప్రోగ్రాం ద్వారా మద్దతు అందిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి అంజయ్యతో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలకు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ స్థాపన, నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాపార సంస్థలు నెలకొల్పడానికి ఆసక్తి గల మహిళా సంఘాల సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వి హబ్ సంచాలకులు జాహిద్‌షేక్, అసోసియేట్ డైరెక్టర్లు ఊహ, డాక్టర్ సల్మాన్, ఈడీసీ ప్రశాంత్, డీపీఎం నాన్ ఫార్మింగ్ సారయ్య పాల్గొన్నారు.


