బైక్‌పై వెళ్తుండగా ఫిట్స్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌పై వెళ్తుండగా ఫిట్స్‌

Feb 26 2026 7:26 AM | Updated on Feb 26 2026 7:26 AM

బైక్‌పై వెళ్తుండగా ఫిట్స్‌

బైక్‌పై వెళ్తుండగా ఫిట్స్‌

ఇంద్రవెల్లి: బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా ఫిట్స్‌ రావడంతో వాహనదారుడు మహిళను ఢీకొట్టి కింద పడిపోయిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా మామడ మండలం గాయికిపల్లి గ్రామానికి చెందిన సిడాం దేవ్‌రావ్‌ ఉట్నూర్‌ నుంచి గుడిహత్నూర్‌ వైపు వెళ్తుండగా ఇంద్రవెల్లి అంజిచౌక్‌ వద్ద ఫిట్స్‌ రావడంతో రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇంద్రవెల్లి మండలంలోని వడగాం గ్రామానికి చెందిన కుంర నాజుక అనే మహిళను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. ప్రమాదంలో సిడాం దేవ్‌రావ్‌కు తీవ్ర గాయాలు కాగా మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దేవ్‌రావ్‌ను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. మహిళను కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం సిడాం దేవ్‌రావ్‌ పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement