అక్రమంగా కలప నిల్వ ఉంచిన వ్యక్తి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా కలప నిల్వ ఉంచిన వ్యక్తి రిమాండ్‌

Feb 26 2026 7:26 AM | Updated on Feb 26 2026 7:26 AM

అక్రమంగా కలప నిల్వ   ఉంచిన వ్యక్తి రిమాండ్‌

అక్రమంగా కలప నిల్వ ఉంచిన వ్యక్తి రిమాండ్‌

బజార్‌హత్నూర్‌: డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావ్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో ప్రవీణ్‌ మహజన్‌ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు బుధవారం మండలంలోని భూతాయి(బి) గ్రామంలో దాడులు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన వడ్రంగి దర్శన్‌వాడ్‌ రాజేందర్‌ అటవీ ప్రాంతంలో టేకు చెట్లను నరికి రూ.15 వేల విలువ గల టేకు దుంగలు తన ఇంటి ఆవరణలో అక్రమంగా నిల్వ చేశాడు. దీంతో టేకు దుంగలు స్వాధీనం చేసుకుని రాజేందర్‌ను బోథ్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌బీవోలు కేశవ్‌, తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement