ఇంట్లో అగ్ని ప్రమాదం
కుంటాల: మండలంలోని ఓలా గ్రామంలో గల ఓ ఇంట్లో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించడంతో సామగ్రి దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేదరి విఠలబాయి ఇంట్లో గడ్డం సాగర, ఆమె తల్లి భోజాబాయి, కీర్త్తికతో కలిసి ఉంటున్నారు. గదిలో విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న భోజాబాయి కేకలు వేసింది. బయట ఉన్న ఇరుగుపొరుగువారు వచ్చి చూసేసరికి సోఫాకు నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. దీంతో ద్విచక్ర వాహనం, సామగ్రి, కీర్తిక ధ్రువీకరణ పత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. బుధవారం ఘటన స్థలాన్ని ఆర్‌ఐ అడెల్లు, జీపీవో రాజలింగు సందర్శించి పంచనామా నిర్వహించారు. వారి వెంట సర్పంచ్ కట్ట రవి తదితరులు ఉన్నారు.


