బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు

Feb 26 2026 7:26 AM | Updated on Feb 26 2026 7:26 AM

బీఆర్

బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు

కై లాస్‌నగర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటూ బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు పెడుతుందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బా ల్క సుమన్‌తో బుధవారం ఆయన ములాఖత్‌ అయ్యారు. అనంతరం విలేకరులతో మాడ్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ప్ర భుత్వం వ్యవహరిస్తుందన్నారు. మంత్రి వివేక్‌ ప్రజావ్యతిరేక పాలన విధానాన్ని సుమన్‌ అడ్డుకోవడంతోనే ప్రభుత్వ కుట్ర బయటపడిందన్నారు. రానున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు.

అధిక లోడుతో వెళ్తున్న లారీలకు జరిమానా

రెబ్బెన: మండలంలోని రెబ్బెన, కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ ప్రాంతాల్లో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా అధిక లోడ్‌తో వెళ్తున్న 19 లారీలకు బుధవారం జరిమానా విధించినట్లు ఎస్సై వెంకటకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రెబ్బెన నుంచి కాగజ్‌నగర్‌కు పరిమితికి మించి ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 19 కర్ర లారీలకు రూ. 16,700 జరిమానా విధించి లారీ డ్రైవర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు.

వ్యక్తిపై కేసు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం రెబ్బెనలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం న డుపుతూ పట్టుబడిన వ్యక్తిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రెబ్బెన బస్టాండ్‌ వద్ద వాహనాల తనిఖీ సమయంలో రెబ్బెన నుంచి కాగజ్‌నగర్‌ వైపు అతివేగం, నిర్లక్ష్యంగా వాహ నం నడిపిన సిర్పూర్‌(టి) మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన ఎర్గటి రజినీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇజ్రాయెల్‌ పర్యాటకులకు వైద్య సేవలు

కాసిపేట: రోడ్డు ప్రమాదానికి గురైన ఇజ్రాయెల్‌ పర్యాటకులకు మండలంలోని ధర్మరావుపేట ఉన్నత పాఠశాల ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు బాబ్జీ, అతని మిత్రుడు దసరా సినిమా నటు డు, గేయ, మాటల రచయిత గడ్డం సురేశ్‌లు వైద్య సేవలు అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌కు చెందిన పర్యాట కులు రాజ్‌, డేనిలు మోటారుసైకిళ్లపై వస్తుండగా మందమర్రి శివారులో వారిని ఎదురుగా ఆ వు వచ్చి ఢీకొట్టింది. దీంతో వారు కిందపడడంతో గాయాలయ్యాయి. దీంతో వారిని బాబ్జీ, సురేశ్‌లు మందమర్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అవసరైన వైద్య సామగ్రి కూడా అందజేశారు. అనంతరం పర్యాటకులు నాగ్‌పూర్‌ వైపు పయణమయ్యారు.

బీఆర్‌ఎస్‌ నాయకులపై  అక్రమ కేసులు1
1/1

బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement