హీరాసుకా జయంతి పోస్టర్ ఆవిష్కరణ
ఆదిలాబాద్: ఆదివాసీ పర్ధాన్ కులస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆదివాసీలోని ఇతర తెగలను కలుపుకొ ని గోండి ధర్మగురు హీరాసుకా జయంతి ఉత్సవా లను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వారి నివాసాల్లో వేర్వేరుగా ఆదివాసీ పర్ధాన్ స మాజ్ నేతలతో కలిసి హీరాసుకా జయంతి ఉత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారికి ఆదివాసీ పర్ధాన్ సమాజ్ నాయకులు జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది రాష్ట్రీయ పర్ధాన్ జన్‌జాతి ఉత్తన్ సంఘటన్ జిల్లా, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మార్చి 15న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే హీరాసుకా జయంతి ఆదివాసీ పర్ధాన్ కులస్తులతో పాటు ఆదివాసులు పెద్ద సంఖ్యలో తరలిరా వాలన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆదివాసీ పర్ధాన్ సమాజ్‌కు చెందిన యువకులకు బి ఫారాలు అందజేసి గెలిపించుకున్నామన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌ను కలిసి హీరాసుకా జయంతి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఆదివాసీ పర్ధాన్ సమాజ్ కౌన్సిలర్లు ఆత్రం సాయి, మెస్రం విలాస్, రాష్ట్రీయ పర్ధాన్ జన్‌జాతి ఉత్తన్ సంఘటన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెస్రం శంకర్, గేడం మాధవ్, అధికార ప్రతినిధి కనక విఠల్, రాష్ట్ర అధ్యక్షుడు కుర్సేంగె యాదవ్ రావ్, జాతీయ అధ్యక్షుడు, ముఖ్య సలహాదారుడు సిడాం రాంకిషన్, కుర్సేంగె తానాజీ, గేడం జనార్ధన్, పూసం ఆనంద్‌రావ్, కోవా ప్రభాకర్, గేడం విఠల్, మెస్రం దత్తు, కుడ్మేత ప్రకాశ్, మహిళ సంఘం జాతీయ సంయుక్త కార్య దర్శి, గంగాదేవి తదితరులు ఉన్నారు.


