బీఆర్‌ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి
చెన్నూర్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వవ్యాఖ్యలను చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నా యకులు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయన్నారు. మున్సిపల్ చై ర్మన్ ఎన్నికల సందర్భంగా ఎక్స్‌ఆఫీషీయో ఓ టుహక్కు వినియోగించుకునేందుకు వెళ్లి మంత్రి కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేయడమే కాకుండా మంత్రిపై విమర్శలు చే యడం సిగ్గు చేటన్నారు. చెన్నూర్ బీఆర్‌ఎస్ నా యకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. రానున్న రోజుల్లో నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, కౌన్సిలర్లు అంబటి శంకర్, అజీమోద్దిన్, నాయకులు సాధనబోయిన కృష్ణ, చెన్నూరి రాజేశ్, శ్రీధర్, సుశీల్‌కుమార్, పాతర్ల నాగరాజు పాల్గొన్నారు.


