ఓపెన్‌కాస్ట్‌లో పనులు అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
కాసిపేట: మండలంలోని ఓపెన్‌కాస్ట్‌లో స్థానికులకు ఉద్యోగఉపాధి అవకాశాలు లభించాలని బుధవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్‌లో దుబ్బగూడం గ్రామస్తుల భూములు తీసుకొని నిర్వాసితులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఓపెన్‌కాస్ట్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఇప్పటి వరకు భూ నిర్వాసితులకు ఎటువంటి న్యాయం జరగలేదని, యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. సంబంధిత అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి సమస్య వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, చిన్నధర్మారం సర్పంచ్ స్వప్న, నాయకులు రమేశ్, రాజమౌళి, రాజ్‌కుమార్, గోలేటీ స్వామి, భుక్య రవి, తోడేటి కృష్ణ, ప్రశాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


