రజక సంఘం ధర్నా
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చాకలి చంద్రకళ కుటుంబంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. రజక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరిపెల్లి శ్రీనివాస్, కొత్తకొండ పోశం, కోశాధికారి నస్పూరి పోషం, మఖ్య సలహాదారులు నేరేళ్ల రమేష్, బీసీ సంఘాల నాయకులు నరేండ్ల శ్రీనివాస్, గజెల్లి వెంకటయ్య, రజక సంఘం నాయకులు సతీష్, శ్రీనివాస్, సత్యనారాయణ, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


