నల్లబ్యాడ్జీలతో బీజేపీ నిరసన | - | Sakshi
Sakshi News home page

నల్లబ్యాడ్జీలతో బీజేపీ నిరసన

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

నల్లబ్యాడ్జీలతో బీజేపీ నిరసన

నల్లబ్యాడ్జీలతో బీజేపీ నిరసన

చెన్నూర్‌: కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్‌ నాయకుల దాడిని ఖండించేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, పలువురు ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో బీజేపీ నాయకులు నల్లబాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలు పెట్రేగిపోయాయని అన్నారు. రైతుబంధు లేదు, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్‌ శివకృష్ణ, నాయకులు శంకర్‌, మల్ల య్య, శ్రీనివాస్‌ తదితరలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement