వృత్తి నైపుణ్యం లేని వారిని తొలగించాలి
వేమనపల్లి మండలం కల్వలపేట్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో నైపుణ్యం లేని వారు సభ్యులుగా ఉండడంతో గొడవలు జరుగుతున్నాయి. నైపుణ్య పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారిని సంఘంలో కొనసాగించాలి. లేనివారిని తొలగించాలి. సంఘఽంలో 150 మంది ఉండగా కొందరు నైపుణ్యం లేని వారు కొనసాగుతూ చేపలు పట్టకుండా చెరువులు, ప్రాజెక్టులను ఇతర గుత్తేదారులకు అప్పగిస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. నాలుగేళ్లుగా జీవనోపాధి లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది.
– మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు, కల్వలపేట, వేమనపల్లి


