ఆటల్లో మెరిసిన పోలీసు క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

ఆటల్లో మెరిసిన పోలీసు క్రీడాకారులు

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

ఆటల్లో మెరిసిన పోలీసు క్రీడాకారులు

ఆటల్లో మెరిసిన పోలీసు క్రీడాకారులు

మంచిర్యాలక్రైం: విధి నిర్వహణలో నిత్యం తీరిక లేకుండా ఉండే పోలీసులు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఇటీవల సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ గ్రౌండ్స్‌లో ముగిసిన రాష్ట్ర 4వ పోలీసు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026లో రామగుండం పోలీసు కమిషనరేట్‌కు చెందిన 15మంది పోలీసు క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఏవో శ్రీనివాస్‌, సీఐలు పాల్గొన్నారు.

తండ్రీకొడుకుల ప్రతిభ

రామకృష్ణాపూర్‌: పోలీస్‌ మీట్‌లో రామకృష్ణాపూర్‌కు చెందిన మొండ్యాల శ్రీనివాస్‌, ఆయన కుమారుడు శివకృష్ణ ప్రతిభను కనబర్చి కాంస్య పతకం సాధించారు. కాళేశ్వరం జోన్‌ తరఫున బాస్కెట్‌ బాల్‌ విభాగంలో పాల్గొన్న వీరిద్దరు గతంలోనూ పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నారు. శివకృష్ణ ఆలిండియా పోలీస్‌మీట్‌లో కూడా సత్తా చాటుతున్నాడు. శ్రీనివాస్‌ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో హెడ్‌ కానిస్టేబుల్‌గా, శివకృష్ణ మంచిర్యాల క్లూస్‌టీం విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరిని సీపీ అంబర్‌కిషోర్‌ ఝా అభినందించారు.

హెడ్‌కానిస్టేబుల్‌కు బంగారు పతకం

జైపూర్‌: జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ధర్మయ్య బాడీ బిల్డింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించారు. 75కిలో కేటగిరీ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పతకం గెలుచుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐ నవీన్‌కుమార్‌, ఎస్సై రాజశేఖర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement