పంచాయతీ చట్టంపై అవగాహనకు శిక్షణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంచాయతీరాజ్ చట్టంతోపాటు సర్పంచ్‌ల విధివిధానాలు, బాధ్యతలపై అవగాహనకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో సర్పంచ్‌ల మూడవ విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. జన్నారం, నెన్నెల, బెల్లంపల్లి, కన్నెపల్లి, తాండూర్ మండలాల నుంచి 95 మంది సర్పంచ్‌లు పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్లు డీఎల్‌పీఓలు సతీశ్‌కుమార్, ధర్మారాణి, చెన్నూర్ ఎంపీడీఓ మోహన్, హాజీపూర్ ఎంపీడీఓ సాయివెంకటరెడ్డి, తాండూర్ ఎంపీఓ అనీల్‌కుమార్, వేమనపల్లి ఎంపీఓ వెంకటేశ్, భీమిని ఎంపీఓ కడాల మహేశ్, డీఆర్‌డీఏ ఈసీ–డీటీసీ సత్యనారాయణ శిక్షణ ఇచ్చారు. సర్పంచులకు పంచాయతీ రాజ్ నూతన చట్టం, పంచాయతీ సమగ్రాభివృద్ధి కరదీపికలతో కూడిన కిట్ బ్యాగులను అందజేశారు.


