ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వివేక్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వివేక్‌

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వివేక్‌

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వివేక్‌

● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ● జైలులో బాల్క సుమన్‌తో ములాఖత్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర మంత్రి వివేక్‌ అపహాస్యం చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. సోమవారం జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ములాఖత్‌ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో క్యాతన్‌పల్లి చైర్మన్‌ పీఠమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం, మంత్రి వివేక్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. బాల్క సుమన్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని, వీరికి బెయిల్‌ రాకుండా ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. కస్టడీ కోరుతూ పోలీసులు బాల్క సుమన్‌ను వేధించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి వివేక్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ ద్యావ వసంత తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement