బాసరలో హైకోర్టు జడ్జి పూజలు
బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి సూరిపల్లి నంద కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. జడ్జి ముందుగా జిల్లా పోలీసులు గౌరవ వందన స్వీకరించారు. తర్వాత అర్చకులు పూర్వకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో ఆలయ ప్రధానార్చకుడు సంజీవ్ పూజారి కుంకుమార్చన చేయించారు. పూజల అనంతరం న్యాయమూర్తి సూరిపల్లి నంద అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత అర్చకులు హారతి, ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదించారు. వీరి వెంట భైంసా పట్టణ న్యాయమూర్తి దేవేందర్ బాబు, ఏఎస్పీ రాజేశ్‌మీనా, తహసీల్దార్ పవన్చంద్ర, సీఐ కిరణ్, ఆలయ ఏఈవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.


