రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ అనుబంధ గ్రామం చర్లపల్లి వద్ద సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. టెంబరేణి గ్రామానికి చెందిన జశ్వంత్(19) అనే యువకుడు స్కూటీపై స్వగ్రామానికి వస్తూ మరో ద్విచక్ర వాహనంపై నిర్మల్ వైపు వెళ్తున్న రమేశ్ అనే వ్యక్తిని చర్లపల్లి వద్ద ఢీకొట్టాడు. ప్రమాదంలో జశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతర వాహనదారులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా ఈఎంటీ ఆనంద్, పైలట్ సాయికిరణ్ క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు జశ్వంత్ కుటుంబ సభ్యులు తెలిపారు.


