గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

గంజాయి పట్టివేత

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

గంజాయ

గంజాయి పట్టివేత

కెరమెరి: మండలంలోని సావరఖెడా గ్రామ శివారులో సోమవారం గంజాయి పట్టుకున్నట్లు ఎస్సై మధుకర్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సిబ్బందితో కలిసి సావర్‌ఖెడా గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సరోజిత్‌ మండల్‌ను తనిఖీ చేయగా ఆయన వద్ద నుంచి 210 గ్రాముల గంజాయి లభ్యమైంది. పట్టుకున్న గంజాయి విలువ రూ.5,250 ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

కారు బోల్తా.. ఒకరికి గాయాలు

బజార్‌హత్నూర్‌: మండలంలోని పిప్రి గ్రామం వద్ద కారు బోల్తా పడి ఒకరు గాయపడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజ్‌కుమార్‌ రెడ్డి మండలంలోని గులాబ్‌తాండ్‌ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం విధులు ముగించుకొని తన కారులో ఇచ్చోడ వస్తున్న క్రమంలో పిప్రి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి వంతెనపై నుంచి వాగులో బోల్తాపడింది. ప్రమాదంలో రాజ్‌కుమార్‌రెడ్డికి స్వల్ప గాయాలు కావడంతో ఇచ్చోడలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

ఆన్‌లైన్‌ గేమ్‌తో అప్పుల పాలై ఆత్మహత్య

భీమిని: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పులపాలై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. కన్నెపల్లి మండలం సుర్జాపూర్‌ గ్రామ పంచాయతీ జంగంపల్లి గ్రామానికి చెందిన టాకిరే నగేశ్‌(27) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగేశ్‌ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ ఆడి సుమారు రూ.5 లక్షల వరకు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్‌ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

గంజాయి పట్టివేత1
1/2

గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత2
2/2

గంజాయి పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement