ముగిసిన సీఎం కప్ ఖోఖో పోటీలు
నల్లగొండటూటౌన్/ఆదిలాబాద్: నల్లగొండ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారం ముగిశాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు, బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో నల్లగొండ జట్టు ద్వితీయ బహుమతి, బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు ద్వితీయ బహుమతులు కై వసం చేసుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అనంతరం విజేతలకు మేయర్ బహుమతులు అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల విజేతలుగా నిలిచిన క్రీడాకారులను డీటీఎస్‌వో పార్థసారథి, ఒలంపిక్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఖోఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, అధ్యక్షుడు ఈశ్వర్, ఉపాధ్యక్షుడు దయానంద రెడ్డి తదితరులు అభినందించారు.


