చెత్తతో చేటు? | - | Sakshi
Sakshi News home page

చెత్తతో చేటు?

Feb 23 2026 7:00 AM | Updated on Feb 23 2026 7:00 AM

చెత్త

చెత్తతో చేటు?

● డంప్‌యార్డులో పేరుకుపోతున్న తీరు ● నిప్పంటిస్తే చెలరేగుతున్న మంటలు ● కమ్ముకుంటున్న పొగతో ఇబ్బందులు ● దుర్గంధంతో రోగాల బారిన ప్రజలు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరంలోని ఆండాళమ్మ కాలనీలో డంప్‌యార్డుగా మారిన డీసీసీ కేంద్రంలోని చెత్త కాలుతుండగా వస్తున్న పొగతో స్థాని కులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరంలో సేకరిస్తు న్న రోజువారీ చెత్తను డంప్‌యార్డులో వేస్తుండడం, తక్కువ స్థలంతో ఎక్కడికక్కడ చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. స్థలం సరిపోక నగరపాలక సంస్థ కా ర్మికులే చెత్తను కాలుస్తున్నారనే ఆరోపణలు వస్తుండగా, ఎండ వేడికి చెత్తకు నిప్పంటుకుంటోందని అధికారులు చెబుతున్నారు. ఆండాళమ్మ కాలనీని ఆనుకుని ఉన్న రంగంపేట్‌, పవర్‌సిటీ కాలనీ, గ్రీన్‌సిటీ, రాళ్లపేట్‌, పాతమంచిర్యాల, లక్ష్మీనగర్‌ వరకు పొగ కమ్ముకుంటోంది. రాత్రిళ్లు పొగతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, తెల్లారేసరికి బూడిద ఇంటి పరిసరాల్లో పడుతోంది. చెత్త కాలడంతో వెలువడే దట్టమైన పొగతో స్థానికులు రోగా ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నిమోనియా, అస్తమా రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్దిరోజులుగా వ్యాపిస్తున్న పొగతో రోగాల బారిన పడుతున్నామని ఆయా కాలనీల ప్రజలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 19వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వెళ్లగా డంప్‌యార్డును ఈ ప్రాంతం నుంచి తరలించాలని ఆయా కాలనీలవాసులు కోరారు.

తడి, పొడి చెత్త ఒకేచోట

మంచిర్యాల నగరంలో ప్రతిరోజూ 45మెట్రిక్‌ ట న్నుల చెత్త వెలువడుతోంది. ఇళ్లల్లోనే తడి, పొడి చె త్తను వేరు చేసి ఇవ్వాల్సి ఉండగా ఆ దిశగా అధికా రులు ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతో కార్మికులు సేకరించిన చెత్తను తీసుకెళ్లి డంప్‌యార్డులో వేస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, మెడికల్‌ దుకాణాలకు చెందిన వారు బయోవేస్టేజ్‌, కాలం చె ల్లిన మందులను ఆండాళమ్మ కాలనీలోని డంప్‌ యార్డు చెత్తలో కలిపేస్తున్నారు. తడి, పొడి చెత్తలో అవి కలిసిపోయి వెలువడే హానికర పొగతోనే ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. తడి, పొడి చెత్త ను వేరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, కనీసం చెత్తలో బయోవేస్టేజ్‌ చెత్త క లవకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నా రు. డంప్‌యార్డుకు శాశ్వత స్థలాన్ని కేటాయించి త డి, పొడి చెత్తను వేరు చేసేలా చర్యలు తీసుకోవా లని, చెత్త నుంచి ఎరువు తయారు చేసేలా చర్యలు తీసుకుంటే సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తరలించకుంటే ఉద్యమమే..

ఆండాళమ్మ కాలనీలోని డంప్‌యార్డును తరలిస్తామని కాంగ్రెస్‌ నాయకులు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. డంప్‌యార్డుతో స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త కాలుతుండగా వచ్చే పొగతో అనారోగ్యానికి గురై కొందరు చనిపోయిన ఘటనలున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వెంటనే డంప్‌యార్డును తరలించకుంటే దశలవారీగా ఉద్యమిస్తాం.

– ముఖేశ్‌గౌడ్‌, బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌

పాలకవర్గం చర్యలు తీసుకోవాలి

అధికారంలోకి వచ్చిన వెంటనే డంప్‌యార్డు సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రెండేళ్లు దాటినా నెరవేర్చలేదు. ప్రస్తుతమున్న డంప్‌యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. సమీపంలోనే కాలనీలేర్పడి నివాసాలు పెరిగాయి. పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకవర్గం చర్యలు చేపట్టి డంప్‌యార్డును ఇక్కడి నుంచి వేరేచోటకు తరలించాలి.

– గాదె సత్యం, బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు

సమస్య పరిష్కారానికి కృషి

నగరంలోని 19వ డివిజన్‌ ప్రజలు ఆండాళమ్మ కాలనీలో ఉన్న డంప్‌యార్డుతో ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నుంచి పొగ వచ్చి స్థానికులు పడుతున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు మంటలు ఆర్పడంతో పాటు, చెత్తకు అంటుకోకుండా నీ టిని చల్లిస్తాం. శాశ్వత డంప్‌యార్డుకు ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వీలైనంత త్వరగా డంప్‌యార్డు తరలించి సమస్య పరిష్కరిస్తాం.

– కకుల వరలక్ష్మి, 19వ డివిజన్‌ కార్పొరేటర్‌

చెత్తతో చేటు?1
1/3

చెత్తతో చేటు?

చెత్తతో చేటు?2
2/3

చెత్తతో చేటు?

చెత్తతో చేటు?3
3/3

చెత్తతో చేటు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement