● పన్నుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ● ఇప్పటివరకు 33శాతం వసూలు ● ముంచుకొస్తున్న ప్రభుత్వ గడువు ● సర్కారు లక్ష్యం చేరడం గగనమే! | - | Sakshi
Sakshi News home page

● పన్నుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ● ఇప్పటివరకు 33శాతం వసూలు ● ముంచుకొస్తున్న ప్రభుత్వ గడువు ● సర్కారు లక్ష్యం చేరడం గగనమే!

Feb 23 2026 7:00 AM | Updated on Feb 23 2026 7:00 AM

● పన్నుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ● ఇప్పటివరకు 33శాతం

● పన్నుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ● ఇప్పటివరకు 33శాతం

● పన్నుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ● ఇప్పటివరకు 33శాతం వసూలు ● ముంచుకొస్తున్న ప్రభుత్వ గడువు ● సర్కారు లక్ష్యం చేరడం గగనమే!

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పన్నుల వసూలు నత్తనడకన సాగుతోంది. మార్చి 31తో చెల్లింపు గడువు ముగుస్తుండగా ఇప్పటివరకు 33శాతం పన్నులే వసూలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూరు మున్సిపాలిటీతో పాటు హాజీపూర్‌ మండలంలోని పోచంపాడ్‌, గుడిపేట్‌, నర్సింగాపూర్‌, నంనూరు, చందనాపూర్‌, ముల్కల్ల, కొత్తపల్లి, వేంపల్లి గ్రామపంచాయతీలను కలుపుతూ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో విలీనమైన మున్సిపాలిటీతో పాటు ఆయా గ్రామాల్లో మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేంద్రంగానే పాలన కొనసాగుతోంది. పన్ను వసూళ్లకు మార్చి 31వ తేదీ వరకు గడువు ఉండడం, వసూలైన మొత్తంతోనే కార్పొరేషన్‌ అభివృద్ధి ఆధారపడి ఉంది. 40 రోజుల్లోపు వందశాతం వసూళ్లు పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. గతేడాది పన్ను వసూళ్లు అంతంతగానే ఉండగా, ఈ ఏడాది ఎన్నికల పుణ్యమాని పది శాతానికి పైగా వసూలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారిని బలపరిచిన ఓటర్లు తప్పనిసరిగా పూర్తి ఆస్తి పన్ను చెల్లించి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలనే నిబంధనతో కొంత వరకు ఆస్తి పన్ను చెల్లించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో వసూళ్లు నెమ్మదించాయి.

బకాయిలపై దృష్టి పెడితేనే..

మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 50,059 ఇళ్లు ఉండగా, ప్రస్తుత పన్ను డిమాండ్‌ రూ.18.94 కోట్లుగా ఉంది. గతంలో పన్ను చెల్లించక పోవడం, ఇతరత్రా పెనాల్టీలు కలుపుకొని ప్రస్తుత డిమాండ్‌ రూ.30.67 కోట్లకు పెరిగింది. ఏటా పన్ను వసూళ్లను పూర్తిస్థాయిలో చేపట్టక పోవడంతో పెండింగ్‌ ఆస్తి పన్నుపై వడ్డీ పడుతూ డిమాండ్‌ పెరిగిపోతోంది. అసలైన పన్ను డిమాండ్‌ రూ.18.94 కోట్లు కాగా, పెనాల్టీలు, పాత బకాయిలు రూ.11.73 కోట్లుగా ఉంది. 50,059 ఇళ్లు కార్పొరేషన్‌ పరిధిలో ఉండగా, ఇందులో నివాస గృహాలు 45,916, కమర్షియల్‌ భవనాలు 2,030, మిక్స్‌డ్‌ భవనాలు 2,113గా ఉన్నాయి. ప్రస్తుత బకాయిల్లో రూ.8.94 కోట్లు వసూలు కాగా, పాత బకాయిలు, పెనాల్టీల కు సంబంధించి రూ.1.38 కోట్లు వసూలయ్యాయి. దీంతో మొత్తం ఆస్తి పన్ను రూ.10.31కోట్లు వసూలు కాగా, 33.62శాతం వరకు వసూలైంది. ఇంకా 77శాతం పన్ను వసూలు చేయాల్సి ఉంది.

జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలతో పాటు పెద్ద మొత్తంలో బకాయిదారులు ఎవరున్నారనే జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ముందుగా బకాయిదారులకు నోటీసులు అందించి, వారి నుంచి స్పందన రానిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, జప్తులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండానే కొందరు కాలం వెల్లదీస్తుండడంతో రావాల్సిన ఆదాయం సమకూరక అభివృద్ధి కుంటుపడుతోంది. కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, కార్మికులకు అందించే వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement