‘మధ్యాహ్నం’కు ఆవిరి బియ్యం
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి మధ్యాహ్నం రుచికరమైన భోజనం అందించనుంది. మ ధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం మార్చి 1నుంచి ఆవిరి బియ్యం (స్టీమ్ రైస్) సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో అందించే మ ధ్యాహ్న భోజనం సరిగా లేదని అనేక ఫిర్యాదులు వచ్చాయి. సరఫరా చేసిన సన్నబియ్యం కొత్తవి కా వటమో ఏమో గాని.. అన్నం ముద్దగా మారుతుందని విద్యార్థులు ఆందోళనకు దిగిన సందర్భాలనే కం. సమస్య అధిగమించేందుకు మార్చి 1నుంచి స్టీ మ్‌రైస్ సరఫరా చేయాలని సర్కారు నిర్ణయించింది.
స్టీమ్ రైస్‌లో పోషకాలు
సాధారణ బియ్యంతో పోల్చితే స్టీమ్ రైస్‌లో పోషకా లుంటాయి. త్వరగా జీర్ణం కావడంలాంటి అనేక ప్ర యోజనాలుంటాయి. అన్నం పొడిగానే ఉంటుంది. నాణ్యత, రుచికరంగా ఉండటంతోపాటు ఎక్కువ గంటలు చెడిపోకుండా ఉంటుంది. పాలిషింగ్ సమయంలో సూక్ష్మ పోషకాల నష్టం తక్కువగా ఉంటుంది. ధాన్యాన్ని పాలిష్ చేయటానికి ముందు నీటిలో నానబెట్టి ఆవిరితో ఉడికించి ఆపై ఎండబెడతారు.
జిల్లాలో అమలు ఇలా..
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మధ్యాహ్న భోజనం అమలవుతోంది. 747 ఏజెన్సీ ల్లో 1,249మంది మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేస్తున్నారు. 747 పాఠశాలల్లో 37,650 మంది విద్యార్థులున్నారు. ఒకటి నుంచి ఐదోతరగతి వి ద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు ఒక్కొక్కరికి రూ.6.78, 6నుంచి 8వతరగతి వారికి రూ.9.29, 9నుంచి 10వతరగతి విద్యార్థులకు రూ.13.17 చొప్పున చెల్లిస్తున్నారు. కూరలు, పప్పులు, నూనెలను వంట ఏజెన్సీ మహిళలు సమకూర్చుకుంటుండగా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం స రఫరా చేస్తోంది. పాతకాలపు పాత్రల్లో వండుతుండగా అన్నం అడుగంటి తినడానికి విద్యార్థులు ఇ బ్బందులు పడేవారు. దీంతో అన్నం గిన్నెలు, స్టీలు బకెట్లు, గరిటెలు తదితర పాత్రల కొనుగోలుకు ప్రభుత్వం రూ.63లక్షలు మంజూరు చేసింది.
బియ్యం సరఫరా ఇలా..
జిల్లాలో ప్రతినెలా 305.148 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం (స్టీమ్‌రైస్) అవసరం ఉంది. ప్రభుత్వ వసతిగృహాలకు 198.463 మెట్రిక్ టన్నులు, మిడ్ డే మీల్స్ (మధ్యాహ్న భోజనం)కు 73.085 మెట్రిక్ టన్నులు, ఐసీడీఎస్‌లకు 33.600 మెట్రిక్ టన్నులు సన్నబియ్యం సరఫరా అవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.


