నగర అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

నగర అభివృద్ధికి కృషి చేయాలి

Feb 23 2026 7:00 AM | Updated on Feb 23 2026 7:00 AM

నగర అ

నగర అభివృద్ధికి కృషి చేయాలి

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని, వచ్చే ఐదేళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని మంచిర్యాల ఎ మ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సూచించారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఆదివారం దర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నెలలోపు నిత్యం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చూశానని చెప్పారు. ఎక్కడైనా తాగునీటికి సమస్యలుంటే ముందుగా వాటిపై దృష్టిసారించాలని సూచించారు. స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి పారిశుధ్య నిర్వహణ పనులు పూర్తి చేయాలని తెలి పారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పాలకవర్గం దృష్టి సారించాలని, అందరితో కలిసి అభివృద్ధి చేపట్టాలని సూచించారు. అనంతరం మేయర్‌ మధుకర్‌ మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని, ఎమ్మెల్యేతో పాటు సీనియర్‌ ప్రజాప్రతినిధుల సలహాలతో ముందుకు వెళ్తామని చెప్పారు. నగర పాలకసంస్థ కమిషనర్‌ అన్వేశ్‌, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

మేయర్‌కు సన్మానం

పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కా ర్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌గా దరణి మధుకర్‌, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య బాధ్యతలు స్వీ కరించగా సీపీఐ ఆధ్వర్యంలో సన్మానించారు. నా యకులు రామడుగు లక్ష్మణ్‌, రే గుంట చంద్రశేఖర్‌, లింగం రవి, బాజిసైదా, పూజారి రామన్న, కొనిగంటి నర్సింగరావు శాలువాలతో సత్కరించారు.

నగర అభివృద్ధికి కృషి చేయాలి1
1/1

నగర అభివృద్ధికి కృషి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement