ప్రత్యేక డ్రైవ్‌తో వసూలు చేస్తాం
ఈ ఏడాది వందశాతం పన్నులు వసూలు చేసేందుకు వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా బిల్లు చెల్లింపు మిషన్లను 20వరకు తెప్పించాం. వార్డు ఆఫీసర్లతో కలిపి టీంలను ఏర్పాటు చేసి 100 మంది పాత బకాయిదారుల జాబితా తయారు చేసి వారి నుంచి వసూలు చేయడంపై దృష్టిపెడతాం. పాత బకాయిలతో పాటు మిగతా పన్నులు వసూలు చేస్తాం.
– అన్వేశ్, మంచిర్యాల మున్సిపల్
కార్పొరేషన్ కమిషనర్


