ఖైర్‌డట్వాలో కట్నకానుకలు నిషేధం
నార్నూర్: మండలంలోని ఖైర్‌డట్వాలో పెళ్లిళ్లకుకట్న కానుకలు తీసుకోవద్దు, ఇవ్వొద్దని గ్రామస్తులందరూ కలిసి ఆదివారం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన మాడవి పూర్ణబాయి వివాహం జరిగింది. గ్రామపటేల్ మాడవి నారంజి పటేల్ ఆధ్వర్యంలో ప్రతీ ఇంటి నుంచి నగదు సేకరించి వధువు కుటుంబానికి రూ.26,551 ఆర్థికసాయం అందజేశారు. ఇప్పటినుంచి గ్రామంలో ఏ శుభ కార్యక్రమం జరిగిన కట్న కానుకలు ఇవ్వడం, తీసుకోవడం నిషేధిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో దేవరీ మాడవి జంగు, తొడసం మోతిరం, కారోబార్ కుమ్రా గోవింద్‌రావు, రాయిసెంటర్ సార్‌మేడి తుకారాం, జకు, జాగ్నత్ రావు, భగవంతరావు, చతుర్‌షావ్, లింగోరావు, క్రిష్ణ, నానాజీ, తుల్సిరామ్, జైవంత్,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


