గిరిజన కళ..భళా | - | Sakshi
Sakshi News home page

గిరిజన కళ..భళా

Feb 23 2026 7:00 AM | Updated on Feb 23 2026 7:00 AM

గిరిజ

గిరిజన కళ..భళా

● ఆకట్టుకుంటున్న వెదురు వస్తువులు ● తయారీలో గిరిజన మహిళలు ● నెల రోజుల శిక్షణ పూర్తి

జన్నారం: గిరిజన మహిళలు వెదురుతో అందమైన కళాకృతులను అద్భుతంగా తయారు చేసి భేష్‌ అనిపించుకుంటున్నారు. అలంకరణకు ఉపయోగపడే వస్తువులు, ఇతర కళారూపాలతో జీవనోపాధి పొందుతున్నారు. అడవులపై ఆధారపడకుండా వెదురుతో కళాకృతులు తయారీ చేసి ప్రత్యేక శిక్షణ పొందారు. అటవీశాఖ, స్వచ్ఛంద సంస్థలు ఎంటర్‌ప్రెనుషిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, గ్రాండ్‌ ఫార్మా లిమిటెడ్‌, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ సొసైటీ సహకారంతో వారికి నెలరోజులపాటు శిక్షణ ఇచ్చారు. వారి జీవనోపాధి కోసం హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో రిసార్టుల్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వస్తువులను ట్రాన్స్‌పోర్టు చేసే యోచనలో ఉన్నారు. డివిజన్‌ పరిధిలోని టూరిస్టులు బసచేసే ప్రాంతం, సఫారీ పాయింట్ల వద్ద స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వస్తువుల కొనుగోళ్లు ప్రారంభమైనట్లు మహిళలు పేర్కొంటున్నారు.

నెలరోజుల శిక్షణ

పైలట్‌ ప్రాజెక్టుగా ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌ పరిధి నాయకపుగూడ ఎంపికై ంది. ఇందన్‌పల్లికి చెందిన 30 నాయకపోడ్‌ గిరిజన మహిళలకు శిక్షణ ఇ చ్చారు. నెల రోజులపాటు వెదురుతో వస్తువులు ఎ లా తయారు చేయాలి. ఏ విధమైన వస్తువులు అనే విషయాన్ని తాండూరుకు చెందిన ట్రెనర్‌ చంద్రమౌళి నేర్పించారు. శిక్షణ పూర్తయిన వారు వెదురు వస్తువులు తయారీ కోసం ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌ కార్యాలయం పక్కన వృథాగా ఉంటున్న ఒక డార్మింటరీ హాల్‌ను ఎఫ్‌డీవో రామ్మోహన్‌ కేటాయించారు. శిక్షణ పొందినవారు ప్రతీరోజు ఆ హాల్‌కు చేరుకుని వాటిని తయారు చేస్తున్నారు.

రూ.300తో వెదురు తెస్తే..

గతంలో అడవులకు వెళ్లి వెదురుబొంగు తెచ్చి తడకలు అల్లితే ఒక తడకకు రూ.300 వచ్చేవి. శిక్షణ అ నంతరం వేరేప్రాంతాల నుంచి రూ.300 పెట్టి వెదురు తీసుకువస్తే రూ.5 వేల విలువైన వస్తువులను తయారవుతాయని మహిళలు పేర్కొంటున్నారు. సోఫా, మొబైల్‌ పెట్టుకుని స్టాండ్‌, పూల బుట్ట, పుస్తకాల స్టాండ్‌ ఊయల, పక్షులగూడ లాంటివి త యారీ చేసి ఆకట్టుకుంటున్నారు. వీటి తయారీతో వారికి ఉపాధి అవకాశాలు లభించనుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు వీటిని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

గిరిజన కళ..భళా1
1/1

గిరిజన కళ..భళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement