రాహుల్‌కు.. రైతుల సెల్ఫీ
ఇచ్చోడ: తెలంగాణ ప్రభుత్వం రబీలో రైతులకు రైతుభరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిసినా స్పష్టత రాలేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) రైతులు ఆదివారం పొలాల్లో సెల్ఫీలు దిగి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి వాట్సాప్ ద్వారా పపించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.7,500ల పెట్టుబడిని రూ.6 వేలకు తగ్గించిందన్నారు. అదీ సకాలంలో ఇవ్వడం లేదని విమర్శించారు. యాసంగి పంటలు కోతకు వస్తున్నా పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. వెంటనే రైతు భరోసా జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు విఠల్, ప్రహ్లాద్, దత్త, నాగ్‌నాథ్, తిరుపతి, తులిసిరాం పాల్గొన్నారు.


