కోతులను తప్పించబోయి.. | - | Sakshi
Sakshi News home page

కోతులను తప్పించబోయి..

Feb 23 2026 7:00 AM | Updated on Feb 23 2026 7:00 AM

కోతుల

కోతులను తప్పించబోయి..

● చెట్టును ఢీకొట్టిన కారు ● ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

కడెం: కోతులను తప్పించబోయి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కడెం మండలంలోని దోస్త్‌నగర్‌ ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. మంచిర్యాల ఇస్లాంపూరకు చెందిన నసీరుద్దీన్‌ (50) మంచిర్యాలలో రెవెన్యూ శాఖలో సర్వే విభాగంలో డీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ఇర్ఫానా నిర్మల్‌లో ప్రభుత్వ ఉపాధ్యారాయులిగా పనిచేస్తోంది. ఆదివారం భా ర్య ఇర్ఫానా, కూతురు నేహా షరీన్‌, మనువరాలు అయురాతో కలిసి నిర్మల్‌ నుంచి మంచిర్యాలకు కారులో తిరుగు పయనమయ్యారు. కడెం వైపు నుంచి జన్నారం వైపు వెళ్తుండగా మార్గమధ్యలో కోతులు అడ్డురాగా వాటిని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నసీరుద్దీన్‌ అక్కడిక్కడే మృతి చెందగా, కూతురు నేహాషరీన్‌, మనువరాలు అయురా, కారు డ్రైవర్‌ హైరాహునేన్‌కు గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికిరణ్‌ తెలిపారు.

కోతులను తప్పించబోయి..1
1/1

కోతులను తప్పించబోయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement