రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్‌ఫూ పోటీలు
మందమర్రిరూరల్: పట్టణంలోని శ్రీకృష్ణ గార్డెన్స్‌లో మన్యు మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రస్థాయి కరాటే కుంగ్‌ఫూ పోటీలు ప్రారంభమయ్యా యి. నారాయణ స్కూల్ కరీంనగర్ జోనల్ ఏజీఎం చైతన్యరావు ఈ పోటీలను ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో విజేతలకు నిర్వాహకులు బహుమతులు, ధ్రువపత్రాలతోపాటు మెడల్స్, కప్‌లు అందజేశారు. నిర్వాహకులు రంగు శ్రీనివాస్ హరికృష్ణ, రమేశ్‌రాజా, మోహన్, భూమయ్య, వెంకటేష్, చిరంజీవి తదితరులు ఉన్నారు.
మోసం చేసిన వ్యక్తికి
14 రోజుల రిమాండ్
కాగజ్‌నగర్‌రూరల్: వ్యవసాయ భూమి అమ్ముతానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తికి సిర్పూర్(టి) జూనియర్ సివిల్ జడ్జి అజయ్ ఆదివారం 14 రోజులు రిమాండ్ విధించారు. వివరాల్లోకి వెళ్తే.. కాగజ్‌నగర్ మండలం మాలిని పరిధిలో పదెకరాల వ్యవసాయ పట్టా భూమిని అమ్ముతానని కౌటాల మండలం బోదంపెల్లికి చెందిన రాంటెంకి ప్రకాశ్ కాగజ్‌నగర్‌కు చెందిన కృష్ణను నమ్మించాడు. ప్రకాశ్ అతని నుంచి రూ.17 లక్షలు తీసుకున్నాడు. భూమిని చూపించాలని కోరగా చూపెట్టకపోవగా బెదిరించాడు. బాధితుడు కృష్ణ ఫిర్యాదుతో రెండు నెలల క్రితం కేసు నమోదైంది. పరారీలో ఉన్న ప్రకాశ్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరపర్చారు. నిందితుడి నేరం రుజువు కావడంతో ఈమేరకు జడ్జి.. రిమాండ్ విధించినట్లు రూరల్ ఎస్సై సందీప్ తెలిపారు.


