నేడు గురుకుల ప్రవేశ పరీక్ష
బెల్లంపల్లి: ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి, 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ డీసీవో రమా కళ్యాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో 2వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు విధిగా హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్, బ్లూ బాల్‌పాయింట్ పెన్ వెంట తీసుకుని నిర్దేశించిన సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.


