రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం
పాతమంచిర్యాల: దళిత బహుజన రాజ్యాంగ హ క్కుల కోసం పోరాటం చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవా ది వడ్లమూడి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మ డి జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా ఆయన హాజై మాట్లాడారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పులి రాజారాం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ రేపల్లి నరేశ్, పార్టీ ఇన్‌చార్జీలు రాజలింగం, ఎన్. రాంచందర్, పిట్ల ఈశ్వర్, గందం శంకర్ పాల్గొన్నారు.


