పట్టపగలే చోరీ | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే చోరీ

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

పట్టపగలే చోరీ

పట్టపగలే చోరీ

భీమారం: మండలంలోని నర్సింగాపూర్‌ గ్రా మంలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. గుంటి సత్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి అదే గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు వెళ్లారు. మధ్యాహ్నం వచ్చి చూసేసరికి ఇంటికి వేసిన తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో 6 తులాల బంగారం, 8 తులాల వెండి, రూ.30 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు స మాచారం అందించారు. ఎస్సై రాజేందర్‌ ఘ టన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీంని రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement